చైనాలో భారీస్థాయిలో విడుదల కానున్న 'మెర్సల్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైనాలో భారీస్థాయిలో విడుదల కానున్న 'మెర్సల్'

  • చైనాలో భారీ సక్సెస్ ను అందుకున్న 'దంగల్'
  • అక్కడ ఘన విజయాన్ని సాధించిన 'బాహుబలి 2'
  • అదే బాటలో వెళుతోన్న 'మెర్సల్'
విజయ్ హీరోగా దర్శకుడు అట్లీ కుమార్ 'మెర్సల్' సినిమాను తెరకెక్కించాడు. విజయ్ మూడు విభిన్నమైన పాత్రలను పోషించగా, ఆయన సరసన కథానాయికలుగా సమంత .. కాజల్ .. నిత్యామీనన్ నటించారు. తమిళనాట ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి, విజయ్ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. విజయ్ పాత్రల్లోని వేరియేషన్స్ కారణంగా ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.

బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ఈ సినిమాను చైనాలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సరైన కంటెంట్ వుంటే చాలు భారతీయ చిత్రాలకు చైనా ఆడియన్స్ భారీ విజయాలను కట్టబెడతారనే విషయాన్ని, 'దంగల్' .. 'బాహుబలి 2' చిత్రాలు నిరూపించాయి. అందువలన 'మెర్సల్' ను కూడా చైనాలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను చైనా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాలను మొదలుపెట్టారు. అక్కడ ఈ సినిమాకి ఏ స్థాయి ఆదరణ లభిస్తుందో చూడాలి.    
vijay
kajal
samantha

More Telugu News