పాకిస్థాన్ నటి రేష్మను కాల్చిచంపిన భర్త!

  • ఖైబర్ ఫక్తుఖ్వా ప్రాంతంలో ఘటన
  • నిందితుడికి నాలుగో భార్య రేష్మ
  • ఈ సంవత్సరం 15 మంది మహిళా కళాకారుల హత్యలు
పాకిస్థాన్ లో ప్రముఖ నటి, గాయకురాలు రేష్మ దారుణ హత్యకు గురికాగా, ఆమె భర్తే తుపాకితో కాల్చి చంపినట్టు అనుమానిస్తున్నారు. ఖైబర్ ఫక్తుఖ్వా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి నౌషేరా కలాన్ ప్రాంతంలోని హకిమాబాద్ ప్రాంతంలో తన సోదరుడితో ఆమె ఉంటుండగా, ఇంట్లోకి దూసుకొచ్చిన ఓ వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపి పారిపోయాడని 'జియో టీవీ' పేర్కొంది.

నిందితుడు ఆమె భర్తేనని, ఆయనకు రేష్మ నాలుగో భార్యని వెల్లడించింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రేష్మ భర్తను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంచితే, ఈ సంవత్సరంలో పాకిస్థాన్ లో మహిళా కళాకారులను దారుణంగా హత్య చేసిన ఘటనల్లో ఇది 15వది. గాయనిగా మాత్రమే కాకుండా, పాకిస్థాన్ లో ఫేమస్ అయిన 'జోబల్ గోలునా'  డ్రామాలో నటించి, రేష్మ తన అభిమానులను మెప్పించింది.
Go Back to Shorts
Pakistan
Reshma
Murder
Actress
Singer

More Telugu News