మహేశ్‌బాబు సినిమా పేరేంటో తెలిసిపోయింది.. ‘మహర్షి’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్‌బాబు సినిమా పేరేంటో తెలిసిపోయింది.. ‘మహర్షి’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!

  • మహేశ్ బాబు 25వ సినిమా టైటిల్ బయటకు
  • 'మహర్షి'గా వచ్చేస్తున్న సూపర్ స్టార్
  • పండుగ చేసుకుంటున్న మహశ్ ఫ్యాన్స్
సస్పెన్స్ వీడిపోయింది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు 25వ చిత్రం పేరేంటన్నది తెలిసిపోయింది. టైటిల్‌లోని ఒక్కో అక్షరాన్ని చిత్ర యూనిట్ విడుదల చేస్తూ ఉండడంతో ఈ సినిమా పేరుతో సస్పెన్స్ కొనసాగింది. బుధవారం రాత్రి చివరి అక్షరాలను కూడా విడుదల చేయడంతో పూర్తి సినిమా టైటిట్ ఆవిష్కృతమైంది. సినిమా టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

 ‘మహర్షి’ గా మహేష్ రాబోతున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మహేశ్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్, సినిమా టైటిల్ వెల్లడి కావడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. చేతిలో ఫైల్ పట్టుకున్న మహేశ్ బాబు స్టైలిష్‌గా ఉన్నాడు. ఫస్ట్‌లుక్‌ను చూసిన అభిమానులు ఈ సినిమాలో మహేశ్ నిరుద్యోగి అయి ఉంటాడని అప్పుడే స్టోరీ గురించి ఓ అంచనాకు వచ్చేస్తున్నారు.  
Mahesh Babu
Tollywood
Maharshi
Movie

More Telugu News