hatibelagal: హత్తిబెళగల్ క్వారీ పేలుళ్ల కేసులో యజమాని సహా ఆరుగురి అరెస్టు

  • ఏపీ-కర్ణాటక సరిహద్దులో నిందితుల అరెస్టు
  • యజమాని శ్రీనివాస చౌదరి సహా ఆరుగురు అరెస్టు
  • ఈ నెల 3న క్వారీలో పేలుళ్ల ఘటన
కర్నూలు జిల్లాలోని హత్తిబెళగల్ క్వారీ పేలుళ్ల కేసులో యజమాని సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ-కర్ణాటక సరిహద్దులోని చాత్రగుడి వద్ద నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల 3న క్వారీలో సంభవించిన పేలుళ్ల ఘటన అనంతరం యజమాని శ్రీనివాస చౌదరి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిందితులను రేపు ఆలూరు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, క్వారీ పేలుళ్ల ఘటనలో పది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.
hatibelagal

More Telugu News