ముగిసిన కరుణానిధి అంత్యక్రియలు!

  • ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
  • బంగారుపూత పూసిన శవపేటికలో కరుణ పార్థివదేహం
  • తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు
డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. మెరీనా బీచ్ లోని అన్నా స్వ్కేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బంగారుపూత పూసిన శవపేటికలో కరుణానిధి పార్థివ దేహాన్ని ఉంచి ఖననం చేశారు.

అంతకుముందు, కరుణానిధికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ప్రధాని దేవెగౌడ తదితరులు నివాళులర్పించారు. ఆ తర్వాత కరుణానిధి కుటుంబసభ్యులు, సన్నిహితులు తదితరులు నివాళులర్పించారు. కరుణానిధికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
Go Back to Shorts
karunanidhi
chennai

More Telugu News