jagan: ప్రజా సంకల్ప యాత్ర.. జగన్ నడిచే మార్గంలో చీరలు పరిచిన గ్రామస్తులు!
- ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగిన పాదయాత్ర
- పారుపాక క్రాస్ వరకు యాత్ర
- గిడిజామ్ లో జగన్ వస్తున్న మార్గంలో చీరలు పరిచిన గ్రామస్తులు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఈరోజు తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి శివారు నుంచి ప్రారంభమై గిడిజామ్, ఎస్.అగ్రహారం మీదుగా పారుపాక క్రాస్ వరకు కొనసాగింది. అయితే, జగన్ పాదయాత్ర డీజేపురం వరకు కొనసాగాల్సి ఉన్నా వర్షం కారణంగా ఉదయం కార్యక్రమం రద్దు కావడంతో పాదయాత్రను కుదించారు.
దీంతో ఈ రోజంతా రౌతులపూడి మండలంలోనే జగన్ పర్యటించారు. కాగా, గిడిజామ్ ప్రాంతానికి జగన్ చేరుకోగానే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. జగన్ నడిచి వస్తున్న మార్గంలో గ్రామస్తులు వరుసగా చీరలు పరిచారు. వాటిపై జగన్ నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ తో ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు.