మెరీనా బీచ్ వద్ద రంగంలోకి కేంద్ర బలగాలు.. రాజాజీ హాల్ వద్ద తొక్కిసలాటలో ఇద్దరి మృతి!
- జనసంద్రంగా మారిన రాజాజీ హాల్ ప్రాంతం
- బ్యారికేడ్లను ధ్వంసం చేసి లోపలకు వెళ్లేందుకు యత్నిస్తున్న అభిమానులు
- ఓ మహిళ ఆత్మహత్యా యత్నం
మరోవైపు, కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఆయనను తుదిసారి దర్శించుకునేందుకు భారీ ఎత్తున వీఐపీలు, డీఎంకే, కరుణానిధి అభిమానులు వస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు మరణించగా, 33 మంది గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. బ్యారికేడ్లను ధ్వంసం చేసి లోపలకు వెళ్లేందుకు అభిమానులు యత్నిస్తున్నారు. రద్దీని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కావడం లేదు. దీంతో అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కరుణ మరణాన్ని తట్టుకోలేకపోయిన ఓ మహిళ ఆత్మహత్యా యత్నం చేసింది.