బన్నీతో తప్పకుండా సినిమా చేస్తాను: 'గీత గోవిందం' దర్శకుడు

  • నేను రెడీ చేసుకున్న కథలు అల్లు అర్జున్ కి వినిపిస్తుంటాను
  • ఆయనకి తగిన కథను రెడీ చేస్తాను 
  • ఆ ప్రాజెక్టుకు కొంత సమయం పట్టొచ్చు  
అల్లు అర్జున్ తదుపరి సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ తో వుండనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ తరువాత సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తో తప్పకుండా తాను ఒక సినిమా చేయనున్నట్టు దర్శకుడు పరశురామ్ చెప్పాడు. ఆయన తాజా చిత్రం 'గీత గోవిందం' ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ, అల్లు అర్జున్ తో త్వరలోనే సినిమా చేస్తానని అన్నాడు.

 'బన్నీ వాసుతో నాకు మంచి సాన్నిహిత్యం వుంది .. నేను చేయాలనుకున్న కథలు బన్నీ వాసు ద్వారా అల్లు అర్జున్ కి వినిపిస్తూ వుంటాను. నేను రెడీ చేసుకునే కథాకథనాల పట్ల అల్లు అర్జున్ చాలా ఆసక్తిని చూపుతూ ఉంటాడు. అల్లు అర్జున్ తోనే చేయవచ్చును గదా? అని చాలామంది అడుగుతున్నారు. అల్లు అర్జున్ ఆలోచనలను .. ఆయన అభిమానుల అంచనాలను అర్థం చేసుకుని ఒక కథను సిద్ధం చేయాలనుకుంటున్నాను. అందుకు కొంత సమయం పడుతుంది .. అల్లు అర్జున్ తో సినిమా మాత్రం తప్పకుండా వుంటుంది' అని చెప్పుకొచ్చాడు.   
Go Back to Shorts
Allu Arjun
parashuram

More Telugu News