సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సాయిపల్లవికి పాత్ర నచ్చలేదట!
  • మెగా హీరో సినిమాలో రమ్యకృష్ణ 
  • మలయాళ సినిమాలో సన్నీలియోన్
*  చిత్రాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే కథానాయిక సాయిపల్లవి తాజాగా ఓ చిత్రాన్ని తిరస్కరించినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందే ఓ చిత్రంలో కథానాయిక పాత్రకు గాను సాయిపల్లవిని అడిగారట. భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినప్పటికీ, తన పాత్ర నచ్చకపోవడంతో ఈ చిన్నది 'నో' చెప్పేసిందని అంటున్నారు.
*  ప్రస్తుతం 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ తాజాగా మరో చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. వరుణ్ తేజ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కీలక పాత్రను పోషించేందుకు రమ్యకృష్ణ ఓకే చెప్పినట్టు సమాచారం.  
*  దక్షిణాది భాషా చిత్రాలలో అప్పుడప్పుడు కీలక పాత్రలలో నటిస్తున్న బాలీవుడ్ భామ సన్నీ లియోన్ తాజాగా ఓ మలయాళ చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది. 'ఒరు అదార్ లవ్' చిత్రం ఫేం ఒమర్ లూలు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో సన్నీ లియోన్ నాయికగా నటిస్తుంది.
Go Back to Shorts
Sai Pallavi
Ramyakrishna
Sunnyleon

More Telugu News