భారత ఫైటర్ జెట్ తో పోటీ పడిన లాంబోర్గిని కారు... వీడియో!
- గోవాలోని దంబోలిన్ ఎయిర్ పోర్టులో ఘటన
- ప్రత్యేక అనుమతి ఇచ్చిన నేవీ అధికారులు
- పక్కపక్కనే దూసుకెళ్లిన జెట్ విమానం, కారు
'ఆటో వరల్డ్' మేగజైన్ కోసం ఈ వీడియోను షూట్ చేశారు. ఇండియన్ నేవీలో చేరాలని యువత మనసులో బలమైన కోరిక ఏర్పడేలా చూసేందుకు నేవీ అధికారులు ఈ షూట్ కు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన చిత్రాలు తదుపరి 'ఆటో వరల్డ్' మేగజైన్ లో ప్రచురితమవుతాయని సమాచారం. జెట్ విమానంతో పోటీపడుతున్న కారు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దాన్ని మీరూ చూడవచ్చు.