చిరంజీవి నా భయం పోగొట్టారు .. ఆయన డౌట్ అడిగారు: నటుడు సమీర్

  • చిరంజీవితో కలిసి నటించాను
  • ఆయనతో చేయాలంటే షివరింగ్ వచ్చేసేది
  • ఆయన చాలా ఫ్రెండ్లీగా వుండేవారు  
కుటుంబ కథా చిత్రాలలోను .. యాక్షన్ చిత్రాలలోను సమీర్ ఎక్కువగా నటించారు. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయే సమీర్, తాజా ఇంటర్వ్యూలో తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. "చిరంజీవిగారితో 'ఠాగూర్' .. 'జై చిరంజీవ' సినిమాలు చేశాను. ఆయనతో కలిసి పనిచేయాలి అనేసరికి నాకు భయం వేసేది.

 ఆల్రెడీ 'శుభ సంకల్పం'లో కమల్ గారితో చేసేశాను గదా అని మనసుకి సర్ది చెప్పుకునేవాడిని. కానీ చిరూతో సీన్ అనేసరికి షివరింగ్ వచ్చేసేది. ఆ విషయాన్ని గమనించిన ఆయన ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిలా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆయనలా లేకపోతే నేను ఇంకా భయపడిపోయేవాడిని. ఒకసారి ఆయన తన 'కారవాన్' లోకి పిలిచి అరగంటసేపు మాట్లాడారు. 'నీ పేరు సమీర్ .. తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నావ్ .. ఎలా అనేది నాకు అర్థం కావడం లేదు' అన్నారు. 'మా ఫాదర్ ముస్లిమ్ .. మా మదర్ బ్రాహ్మిణ్ సార్' అని చెప్పడంతో ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు" అని చెప్పుకొచ్చాడు. 
Go Back to Shorts
sameer
Chiranjeevi

More Telugu News