Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అర్జున్ రెడ్డి' .. 'ఆర్ ఎక్స్ 100' గురించి మంచు లక్ష్మి

  • 'అర్జున్ రెడ్డి'ని కట్స్ లేకుండా చూశాను 
  • ఆ సినిమాలో వల్గారిటీ లేదు 
  • 'ఆర్ ఎక్స్ 100' గురించి విన్నాను
నటిగా  .. నిర్మాతగా మంచు లక్ష్మికి మంచి గుర్తింపు వుంది. కొత్త సినిమాలపై ఆమె తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతూ వుంటారు. తాజా ఇంటర్వ్యూలో .. 'అర్జున్ రెడ్డి' .. 'ఆర్ ఎక్స్ 100' సినిమాల్లోని బోల్డ్ కంటెంట్ గురించిన ప్రశ్న ఆమెకి ఎదురైంది. అప్పుడు మంచులక్ష్మి స్పందిస్తూ .. 'అర్జున్ రెడ్డి' సినిమాను కట్స్ లేకుండగా నేను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూశాను .. అందులో వల్గారిటీ లేదు' అన్నారు.

 'ఆర్ ఎక్స్ 100' సినిమాను నేను చూడలేదు .. మీరన్నట్టుగా బోల్డ్ కంటెంట్ ఉందని విన్నాను. నేను చూడలేదు కనుక ఆ సినిమాపై కామెంట్ చేయలేను. లాభాల కోసమని వల్గారిటీతో కూడిన సినిమాలు చేయడానికి నేనెంత మాత్రం ఇష్టపడను. 'పెళ్లిచూపులు' .. 'క్షణం ' .. 'మహానటి' సినిమాలు ఎంతో బాగా ఆడాయి. అలా మంచి కథా నేపథ్యం .. పాత్ర ప్రాధాన్యత కలిగిన సినిమాలను చేయడానికి నేను ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతాను" అంటూ చెప్పుకొచ్చారు.
manchu lakshmi

More Telugu News