జగన్ పాదయాత్రకు నిరసనల సెగ.. అడ్డుకున్న కాపులు!
- కాపు రిజర్వేషన్ల పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్
- నల్ల జెండాలు, ప్లకార్డులతో నిరసన
- స్పందించని వైఎస్సార్ సీపీ అధినేత
కాపు రిజర్వేషన్ పై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని యువకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై స్పందించకుండానే జగన్ అక్కడ్నుంచి ముందుకు కదిలారు.