Durgada: తిరుగాడిన చోటనే దుర్గాడ పాముకు అంత్యక్రియలు... గుడి పనులు ప్రారంభం

  • పల్లకీలో ఊరేగించిన దుర్గాడ గ్రామస్తులు
  • గుడి కట్టేందుకు పొలం యజమాని అంగీకారం
  • గురువారం నాడు మరణించిన పాము
26 రోజుల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో పూజలందుకున్న పాముకు అంత్యక్రియలు ఘనంగా జరిపించారు గ్రామస్తులు. గురువారం మధ్యాహ్నం పాము మరణించిన తరువాత శోకసంద్రంలో మునిగిపోయిన ప్రజలు, ఆ రాత్రంతా శివాలయంలో పామును ఉంచి భజనలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆపై నిన్న ఓ పల్లకీలో పాము కళేబరాన్ని ఉంచి, గ్రామ వీధుల్లో ఊరేగించారు. తాను తిరుగాడిన చోటనే ఖననం చేశారు. అక్కడ గుడి కట్టించేందుకు పొలం యజమాని అంగీకరించడంతో ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. శ్రావణ మాసంలోగా గుడి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.
Durgada
Snake
Cremation
Temple

More Telugu News