Malayalam: మరో మలుపు తిరిగిన నటి భావన కేసు... హైకోర్టును ఆశ్రయించిన ఇద్దరు హీరోయిన్లు!

  • మహిళా న్యాయమూర్తి కావాలంటూ పిటిషన్
  • సీబీఐకి కేసును అప్పగించాలన్న నటుడు దిలీప్
  • రెండు పిటిషన్లనూ విచారణకు స్వీకరించిన హైకోర్టు
దక్షిణాది హీరోయిన్ భావన లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్) సభ్యులుగా ఉన్న హీరోయిన్లు హనీ రోజ్, రచనా నారాయణ కుట్టీలు కేరళ హైకోర్టులో ఓ పిటిషన్ వేస్తూ, ఈ కేసులో వాదనలు వినేందుకు మహిళా న్యాయమూర్తినే నియమించాలని కోరారు. ఇదే సమయంలో కేసును సీబీఐకి అప్పగించాలంటూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్ సైతం ఓ పిటిషన్ ను దాఖలు చేయడంతో, రెండు పిటిషన్లనూ కోర్టు విచారణకు స్వీకరించింది.

మాలీవుడ్ లో కలకలం రేపిన భావన వేధింపుల కేసులో మహిళా న్యాయమూర్తిని నియమిస్తామన్న కేరళ సర్కారు, ఇంతవరకూ ఆ పని చేయలేదు. ఇటీవలే దిలీప్ పై విధించిన నిషేధాన్ని సైతం 'అమ్మ' తొలగించింది. ఈ నేపథ్యంలో మహిళా జడ్జి అయితేనే విచారణ పారదర్శకంగా సాగి, సత్వర న్యాయం జరుగుతుందని హనీ రోజ్, రచనలు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.
Malayalam
CBI
High Court
Rachana Narayanakutty
Honey Rose
Bhavana
Sexual Harasment

More Telugu News