Jagan: కాపు రిజర్వేషన్లపై జగన్ మాటలు కరెక్టే: బీసీ సంఘాలు

  • జగన్ వ్యాఖ్యలను స్వాగతించిన బీసీ సంఘాలు
  • ఆ వ్యాఖ్యలకు జగన్ కట్టుబడి ఉండాలి
  • బీసీ సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వెంకటేశ్వరరావు
కాపులకు రిజర్వేషన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను బీసీ సంఘాలు స్వాగతించాయి. జగన్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ జీ వెంకటేశ్వరరావు, ఆ వ్యాఖ్యలకు జగన్ కట్టుబడి ఉండాలని కోరారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం మంత్రులు, నాయకులు చేస్తున్న విమర్శలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీసీలు జగన్ కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.

 కాగా, తాను చేయలేని పనులను చేస్తానంటూ చెప్పలేనని, రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున కాపు రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేనని జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బీసీలను నష్టం జరుగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశానికి తాను మద్దతిస్తానని కూడా చెప్పారు.
Jagan
Kapu Reservation
BCs

More Telugu News