తెలియకుండానే ఫోన్లో దూరిపోయిన ఆధార్ టోల్ ఫ్రీ... తమ తప్పేనంటూ క్షమాపణలు చెప్పిన గూగుల్!
- 80 శాతం స్మార్ట్ ఫోన్లలో తెలియకుండానే చేరిన నంబర్
- 2014లో యూఐడీఏఐ టోల్ ఫ్రీ నంబర్ ను కోడ్ చేశామన్న గూగుల్
- మాన్యువల్ గా డిలీట్ చేసుకోవచ్చంటూ వివరణ
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డీఫాల్ట్ గా ఉండటం వల్లే, సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయిన సమయంలో యూజర్ కు తెలియకుండా ఈ నంబర్ ఇన్ స్టాల్ అయిందని గూగుల్ వెల్లడించింది. 2014 సంవత్సరంలో యూఐడీఏఐ హెల్ప్ లైన్ నంబర్ ను కోడ్ చేశామని, ఆపై అదే వర్షన్ ను ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫాక్చరర్స్)లకు ఇచ్చామని పేర్కొంది. ఈ నంబర్ ను మాన్యువల్ గా డిలీట్ చేసుకోవచ్చని, భవిష్యత్తులో వచ్చే ఆండ్రాయిడ్ వర్షన్ లలో ఈ నంబర్ ఉండదని తెలిపింది.