ఆర్యన్ రాజేశ్ కి నెగిటివ్ రోల్ ఇచ్చిన బోయపాటి!
- యాక్షన్ ఎంటర్టైనర్ గా చరణ్ మూవీ
- విలన్ గా వివేక్ ఒబెరాయ్
- కొత్తగా కనిపించనున్న ఆర్యన్ రాజేశ్
ఈ సినిమాలో ఆర్యన్ రాజేశ్ నెగిటివ్ రోల్ చేయనున్నాడనేది తాజా సమాచారం. విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తుండగా .. ప్రత్యేకత కలిగిన మరో నెగెటివ్ రోల్ లో ఆర్యన్ రాజేశ్ కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ పాత్రను బోయపాటి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడనీ, ఆర్యన్ రాజేశ్ ను కొత్తగా చూపించనున్నాడని అంటున్నారు. కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోన్న ఆర్యన్ రాజేశ్ , ఈ సినిమాతో బిజీ అవుతాడేమో చూడాలి.