హోటల్‌లో రచ్చ చేసిన డీఎంకే యువ నేతలు.. ఆహారం లేదన్నందుకు సిబ్బందిపై పిడిగుద్దులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హోటల్‌లో రచ్చ చేసిన డీఎంకే యువ నేతలు.. ఆహారం లేదన్నందుకు సిబ్బందిపై పిడిగుద్దులు!

  • హోటల్‌లో డీఎంకే నేతల వీరంగం
  • వైరల్ అవుతున్న వీడియో
  • షట్టర్ మూసేసి వెళ్లిపోయిన వైనం
చెన్నై నగరంలోని ఓ హోటల్‌లో డీఎంకే పార్టీ యువ నేతలు రచ్చ చేశారు. హోటల్‌లో ఆహారం అయిపోందని, మూసివేస్తున్నామని అన్నందుకు రెచ్చిపోయారు. హోటల్ సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించారు. సామాన్లను పగలగొట్టి షట్టర్ మూసేసి వెళ్లిపోయారు. వారి వీరంగం దృశ్యాలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతున్నాయి.

డీఎంకే విద్యార్థి విభాగం నేత యువరాజ్ ఇటీవల అనుచరులతో కలిసి డిన్నర్ చేయడానికి నగరంలోని విరుగంబాక్కంలోని ‘సాలెం ఆర్ఆర్ అంబు బిర్యాని’ హోటల్‌కు వెళ్లాడు. అప్పటికే ఆహారం అయిపోవడంతో హోటల్‌ను మూసివేసేందుకు సిబ్బంది రెడీ అవుతున్నారు. దీంతో హోటల్‌లో అన్నీ అయిపోయాయని, తినడానికి ఏమీ లేవని వారికి చెప్పారు. అంతే, యువరాజ్ రెచ్చిపోయాడు. సిబ్బందిపై చేయిచేసుకున్నాడు, పిడిగుద్దులు కురిపించాడు.  

మరోపక్క, అతడి అనుచరులు హోటల్‌లో విధ్వంసం సృష్టించారు. వస్తువులను పగలగొట్టారు. అనంతరం సిబ్బంది అందులో ఉండగానే షట్టర్ మూసేసి వెళ్లిపోయారు. వారి దాడి దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
DMK
Chennai
Tamilnadu
Yuvaraj
Hotel

More Telugu News