ముస్లిం అమ్మాయిలు హిందువుల్ని పెళ్లాడాలి.. అప్పుడే బాధలు తప్పుతాయి!: వీహెచ్ పీ నేత సాధ్వీ
- అప్పుడే ట్రిపుల్ తలాక్ కష్టాలు తప్పుతాయి
- అయోధ్య రాజకీయ అంశం కాదని వెల్లడి
- రామాలయ నిర్మాణాన్ని ఎవ్వరూ ఆపలేరన్న సాధ్వీ
కాగా, యూపీలోని ఓ దేవాలయంలోకి ఓ మహిళా ఎమ్మెల్యే వెళ్లినందుకు మందిరంలో గంగా జలంతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డకు జన్మనిచ్చేందుకు స్త్రీ కావాలి కానీ, దేవాలయంలో పూజలకు మాత్రం ఆమెకు అవకాశం ఉండదా? అని సాధ్వీ ప్రశ్నించారు. మహిళలపై ఇలాంటి వివక్ష ఉండకూడదని అభిప్రాయపడ్డాడు. అయోధ్యలో రామాలయం రాజకీయ అంశం కానేకాదని సాధ్వీ తెలిపారు. ఇది కోట్లాది హిందువుల నమ్మకానికి సంబంధించిన అంశమని ఆమె స్పష్టం చేశారు. రామాలయ నిర్మాణాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు.