కొన్నాళ్ల క్రితం పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం... ఇప్పుడు ఆ యువజంట ఆత్మహత్య!
- ఐదు నెలల క్రితం వివాహం
- శనివారం పొలానికి వెళ్లి ఆత్మహత్య
- ఆర్థిక ఇబ్బందులే కారణమన్న తల్లి
ఈ క్రమంలో శనివారం నాడు తన తల్లి మాణెమ్మ, భార్యతో కలసి పొలానికి వెళ్లిన మల్లేష్, పనులైన తరువాత, తాము బైక్ పై వస్తామని చెప్పి, తల్లిని ఇంటికి పంపించాడు. ఆపై ఎంతసేపటికీ కొడుకు, కోడలు రాకపోవడంతో, ఇంటి సభ్యులతో కలసి తల్లి పొలానికి వెళ్లి చూసి షాక్ కు గురైంది. ఓ చెట్టుకు ఇద్దరూ ఉరేసుకుని విగతజీవులుగా కనిపించారు. ఆర్థిక ఇబ్బందులతోనే వారు మరణించారని మాణెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.