మోదీ జీ... మీ ఆధార్ నంబర్ ఇస్తే మొత్తం చెప్పేస్తా: ఫ్రెంచ్ హ్యాకర్ సవాల్
- ట్రాయ్ చైర్మన్ శర్మ వ్యక్తిగత వివరాలు చెప్పిన ఫ్రెంచ్ హ్యాకర్
- ఇప్పుడు మోదీ ఆధార్ నంబర్ చెప్పాలని సవాల్
- ఆధార్ వ్యవస్థ లోపభూయిష్టమంటున్న ఇలియట్ ఆండర్సన్
ఆపై ప్రధాని నరేంద్ర మోదీ ఆధార్ నంబర్ వెల్లడించాలని, అప్పుడు తాను ఆధార్ వ్యవస్థ ఎంత లోపభూయిష్టమో వెల్లడిస్తానని సవాల్ విసిరారు. గత కొన్ని నెలలుగా ఆధార్ అనుసంధానిత వ్యవస్థపై ఆయన విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఆధార్ సంఖ్య ఆధారంగానే ఆండర్సన్.. శర్మ గురించిన వివరాలు బయట పెట్టారని చెప్పడం అవాస్తవమని ఉడాయ్ వెల్లడించింది. నెట్టింట్లో సెర్చ్ చేసి ఈ వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.