లావు గురించి మాట్లాడితే ఆడాళ్లు ద్వేషిస్తారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లావు గురించి మాట్లాడితే ఆడాళ్లు ద్వేషిస్తారు

ఫ్యాట్‌ టాక్‌.. అనగా.. లావుగా ఉండడం, ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు చేయడం వంటి కబుర్ల గురించి గంటలు గంటలు మాట్లాడడం కొందరి అలవాటు. అదొక్కటే జీవితం అన్నట్లుగా, అదొక్కటే సబ్జెక్టు గురించి మాట్లాడుతూ ఉంటారు. అమ్మాయిల్లో కూడా ఈ లావు యావ జాస్తి. ఏ నలుగురు అమ్మాయిలతో కలిసినా.. లావు గురించి తత్సంబంధిత విషయాల గురించి మాత్రమే మాట్లాడే అమ్మాయిలు కొందరుంటారు. అయితే, వీరు తమకు తాము గొప్పవాళ్లమని... లావు.. వ్యాయామం.. అందం గురించి అందరికీ సలహాలిచ్చి మేలు చేస్తున్నామని అనుకుంటారు గానీ.. నిజానికి మిగిలిన అమ్మాయిలు వీరిని ద్వేషిస్తూ ఉంటారట.

నలుగురు సహచర మహిళలతో కలిసిన ప్రతి సందర్భంలోను లావు గురించి, తగ్గడం గురించి మాట్లాడే వారంటే.. మిగిలిన వారికి చిరాకు కలుగుతూ ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సైకాలజీలో రీసెర్చి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అయిన అలెగ్జాండ్రా కార్నింగ్‌ ఈ విషయంలో ఓ సర్వే నిర్వహించారు. లావున్న మహిళలు మాత్రమే కాకుండా.. మామూలు వాళ్లు కూడా ఇలాంటి లావుగురించి మాట్లాడే వాళ్లని ఇష్టపడరుట. లావు గురించిన మాటలు దైనందిన జీవితంలోకి వచ్చేస్తున్న నేపథ్యంలో... అలాంటి చర్చ వారికి దేహం గురించి అసంతృప్తిని కలిగిస్తుందని అంటున్నారు కార్నింగ్‌.

More Telugu News