చంద్రబాబు మనతో కలిసి వచ్చేలా ఉన్నారు: టీ-కాంగ్రెస్ నేత సర్వే

  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసే అవకాశముంది
  • వంద స్థానాల్లో విజయం సాధిస్తాం
  • ఉత్తమ్ సీఎం అవడం ఖాయం
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యే అవకాశముందని, చంద్రబాబు తమతో కలిసి వచ్చేలా ఉన్నారని టీ- కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ శివారు బోడుప్పల్ లో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించారు. ఈ సభకు ఉత్తమ్, సర్వే సత్యనారాయణ తదితర నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్వే మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని, ఉత్తమ్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, ఆయన కేబినెట్ లో తాను మంత్రిని కావాలని సర్వే ఆకాంక్షించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామనడంతో కోటి మంది దళితులు నాడు టీఆర్ఎస్ కు ఓటు వేశారని అన్నారు.

Chandrababu
survey

More Telugu News