ఏటీఎంలో క్యాష్ పెట్టి.. తాళం చెవిని వదిలేసి వెళ్లిన అధికారులు!

  • ప్రజల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు
  • సెలవు కావడంతో అందుబాటులోకి రాని బ్యాంకు అధికారులు
  • చివరికి అర్ధరాత్రి వచ్చి తాళాన్ని తీసుకెళ్లిన వైనం
ఏటీఎంలో నగదు నింపిన అధికారులు దాని తాళం చెవిని మాత్రం అక్కడే వదిలేసి వెళ్లారు. దీంతో ప్రజలు అందించిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని బ్యాంకు అధికారులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్, తార్నాక విజయపురి లోని లాలాగూడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో చోటుచేసుకుంది.

ఎస్బీ ఐ లాలాగూడ బ్రాంచ్ ఆవరణలో కొన్నిరోజుల క్రితం అధికారులు ఓ ఏటీఎంతో పాటు నగదు డిపాజిట్ మెషీన్ ను ఏర్పాటు చేశారు. అయితే శనివారం ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసిన బ్యాంకు అధికారులు తాళం చెవిని మాత్రం డిపాజిట్ మెషీన్ దగ్గరే వదిలేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో నగదు డ్రా చేయడానికి వచ్చిన కొందరు వ్యక్తులు.. దీన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అయితే శని, ఆదివారాలు సెలవు కావడంతో బ్యాంకు అధికారులెవ్వరూ పోలీసులకు అందుబాటులోకి రాలేదు. చివరికి శనివారం అర్ధరాత్రి పోలీసుల దగ్గరకు వచ్చిన సంబంధిత అధికారులు తాళం చెవిని తీసుకెళ్లారు.
Go Back to Shorts
atm
SBI
KEY
LALAGUDA
Police
OFFICIALS

More Telugu News