Pakistan: బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన ఐసీసీ... పాకిస్థాన్ తో మ్యాచ్ తేదీ మార్పు!

బీసీసీఐ విమర్శలతో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన ఆసియాకప్ షెడ్యూల్ ను స్వల్పంగా మారుస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. సెప్టెంబర్ 18న ఓ క్వాలిఫయర్ తో మ్యాచ్ ఆడనున్న భారత్ కు, ఆ మరుసటి రోజే, అంటే 19న పాకిస్థాన్ తో మ్యాచ్ పెట్టింది ఐసీసీ. ఐసీసీ షెడ్యూల్ వెల్లడైన తరువాత, ఒక్క రోజైనా గ్యాప్ లేకుండా క్రికెట్ ఏంటని బీసీసీఐ మండిపడింది. ఇంత బుర్ర లేకుండా షెడ్యూల్ ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించింది. పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే భావోద్వేగాలతో నిండివుంటుందని, విశ్రాంతి లేకుండా తాము ఆడబోమని తేల్చి చెప్పింది. దీంతో దిగి వచ్చిన ఐసీసీ మ్యాచ్ ని ఒక రోజు పోస్ట్ పోన్ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 20న మ్యాచ్ జరుగుతుందని వెల్లడించింది.
Pakistan
India
Cricket
Asia Cup

More Telugu News