బాబు గోగినేనిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన నాని!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాబు గోగినేనిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన నాని!

  • బాబు వ్యవహారశైలిపై నాని మండిపాటు 
  • గ్రూపులు కట్టొద్దంటూ సూచన
  • కౌశల్‌ను ప్రబుద్ధుడన్న గోగినేని
బిగ్‌బాస్‌ హౌస్‌లో జరుగుతున్న పరిణామాలపై హోస్ట్ నాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ విషయంలో వివాదం, సభ్యులు గ్రూపులు కట్టడం, బాబు గోగినేని అనుచిత వ్యాఖ్యలపై నాని ఘాటుగా స్పందించాడు. ముఖ్యంగా బాబు గోగినేనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. కెప్టెన్సీ టాస్క్ అనంతరం బాబు-గీతామాధురి మధ్య జరిగిన గొడవ విషయంలో బాబుపై నాని మండిపడ్డాడు. మందలించాడు. దీప్తి గెలవడం మీకు ఇష్టం లేదన్న విషయం మీ చేష్టల ద్వారానే అర్థం అవుతోందన్న నాని...  గ్రూపులు కట్టి అందరినీ ప్రభావితం చేస్తున్నారన్నాడు.

గీతా మాధురి విషయంలో అందరూ ఒక్కసారిగా ఎందుకు పైరయ్యారని బాబును నిలదీశాడు. బాబును నామినేట్ చేసిన కారణాలు సరిగా లేవంటూ కౌశల్‌ను మందలించాడు. అయితే, కౌశల్ తన వాదనను సమర్థించుకున్నాడు. రాజమౌళి తనను తాను నాస్తికుడని చెప్పుకుంటాడని, కానీ గుడికి వెళ్లాడంటూ అనవసర వ్యాఖ్యలు చేయడం తనకు నచ్చలేదని, అందుకే నామినేట్ చేశానని కౌశల్ వివరించాడు. స్పందించిన నాని మాట్లాడుతూ.. నాస్తికుడైతే గుడికి వెళ్లకూడదా? అని ప్రశ్నించాడు. రాజమౌళి తన కుటుంబ సభ్యుల కోసం గుడికి వెళ్లి ఉండొచ్చని, తాను కూడా అమ్మమ్మను సంతోషపెట్టేందుకు గుడికి వెళ్తుంటానని చెప్పుకొచ్చాడు.  

కౌశల్‌ను, గీతను హౌస్ నుంచి బయటకు పంపించడమే తన లక్ష్యమని, ఒకవేళ తాను బయటకు వెళ్లిపోయినా, ఆ పని మీరు చేయాలంటూ హౌస్ సభ్యులకు బాబు గోగినేని చెప్పడంపై నాని విరుచుకుపడ్డాడు. ఎవరు ఎవరినీ పంపించలేరని పేర్కొన్నాడు. నాయకత్వ లక్షణాలు నేర్పించడం తన వృత్తన్న బాబుపై నాని మండిపడ్డాడు. నాయకుల్ని తయారు చేసేది మేమేనని, ప్రజలే వారిని తయారుచేస్తారని ఘాటుగా బదులిచ్చాడు.

బాబు మాట్లాడుతూ తనకు హౌస్‌లోనే ఉండాలని ఉందని, కానీ పంపించాలనుకున్నా అందుకు సిద్ధమేనని, తానెవరికీ భయపడనని పేర్కొన్నారు. హౌస్‌లో కౌశల్ గేమ్ ప్లే చేస్తున్నాడంటూ మరోమారు బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రబుద్ధుడు అని విరుచుకుపడ్డాడు.
Babu Gogineni
BigBoss
Actor
Nani
Kaushal

More Telugu News