సాయేషా సైగల్ తో డ్యాన్స్ అంటే మాటలు కాదట!
- అఖిల్'తో తెలుగు తెరకి పరిచయం
- పరాజయం కారణంగా పలకరించని ఛాన్సులు
- తమిళంలో దూసుకుపోతోన్న సాయేషా
సాధారణంగా కాస్త బొద్దుగా వుండే కథానాయికలను మాత్రమే ఇష్టపడే తమిళ తంబీలు .. ఈ నాజూకు భామను ఆరాధిస్తూ ఉండటం విశేషం. సాయేషా సైగల్ తో కలిసి నటించిన హీరోలు డ్యాన్స్ విషయంలో ఆమె స్పీడ్ ను తట్టుకోలేక ఇబ్బంది పడ్డారట. ఈ సుందరికి సంప్రదాయ నృత్యంలోనే కాదు మోడ్రన్ డ్యాన్స్ లోను మంచి ప్రవేశం వుంది. అందువలన డ్యాన్స్ ను అదరగొట్టేస్తోందట. ఈ విషయం ముందుగా అక్కడి హీరోలకి తెలిసినా, ఆమెకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని తామే డ్యాన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని వినికిడి.