బ్రేకింగ్.. బీజింగ్ లోని అమెరికా దౌత్య కార్యాలయం వద్ద పేలుడు!
- దట్టంగా అలముకున్న పొగ
- అమెరికా దౌత్య సిబ్బంది సురక్షితం
- ట్రాఫిక్ ను దారి మళ్లించిన పోలీసులు
- బాంబు దాడేనని ప్రకటించిన అమెరికా అధికారులు
ఇటీవల అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ పేలుడు జరగడంతో దీనిని సీరియస్ గా తీసుకుంటున్నారు. తాజా పేలుడుపై వ్యాఖ్యానించేందుకు చైనా ప్రభుత్వ వర్గాలు నిరాకరించాయి. అయితే తమపై బాంబు లాంటి పరికరంతో దాడి జరిగిందని అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది. బీజింగ్ లోని ఈ ప్రాంతంలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్, దక్షిణ కొరియా సహా పలు దేశాల దౌత్య కార్యాలయాలు ఉన్నాయి.