నేను బృంద నాయకుడిని మాత్రమే.. క్రెడిట్ మీదే: చంద్రబాబు
- వృద్ధిరేటులో ఏపీ నెంబర్ వన్
- అధికారులకు సత్కారం
- అవార్డులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్న సీఎం
అనంతరం మాట్లాడుతూ.. నాలుగేళ్లు రాత్రీపగలు కష్టపడి పనిచేస్తేనే రాష్ట్రం గాడిలో పడిందన్నారు. అవార్డుల ద్వారా గుర్తింపు వస్తుందని, గుర్తింపు వల్ల ఉత్సాహం పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. తాను బృంద నాయకుడిని మాత్రమేనని, ఈ క్రెడిట్ మొత్తం బృందానికే దక్కుతుందన్నారు. అవార్డులు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు సాగాలని అధికారులకు సీఎం సూచించారు.