జగన్ అనే నేనుగా.. మళ్లీ 2024లో మీ వద్దకు వస్తా!: వైసీపీ అధినేత జగన్
- తూ.గో. జిల్లా లోని పెద్దాపురంలో బహిరంగసభ
- 2018 లేదా 2019 లోనో ఎన్నికలు జరుగుతాయి
- అధికారంలో కొస్తే ఒక్క మందు షాపూ లేకుండా చేస్తా
‘2018 లోనో లేదా 2019 లోనో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఐదేళ్లకు 2024లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. జగన్ అనే నేనుగా.. మళ్లీ 2024లో జరిగే ఎన్నికల కోసం మీ దగ్గరకు వచ్చే సరికి ఒక్క మందు షాపు కూడా కనపడకుండా చేస్తానని హామీ ఇస్తున్నాను. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని, తోడుగా ఉండమని ప్రాధేయపడుతున్నాను’ అని జగన్ అన్నారు.