'పడి పడి లేచె మనసు' రిలీజ్ డేట్ ఖరారు
- శర్వానంద్ హీరోగా 'పడి పడి లేచె మనసు'
- కథలో మార్పులు .. చేర్పులు
- డిసెంబర్ 21వ తేదీన విడుదల
ఈ మధ్య వదిలిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల వచ్చిన 'తేజ్ ఐ లవ్ యూ' లోని ఓ పాయింట్ కి .. ఈ సినిమాలోని పాయింట్ కి మధ్య దగ్గర పోలికలు వున్నాయనే టాక్ వచ్చింది. దాంతో కథలో మార్పులు చేసే పనిలో హను రాఘవపూడి ఉన్నాడనీ .. విడుదల విషయంలో జాప్యం జరగవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయాలను అలా ఉంచితే .. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇచ్చేసి ఈ సినిమా టీమ్ ఒక స్పష్టతను తీసుకొచ్చింది.