కేటీఆర్ కు ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరిన రేవంత్ రెడ్డి!
- పొలిటికల్ ఫిట్ నెస్ లో నాతో పోటీపడేవారు లేరు
- కేటీఆర్ వి ఫిట్ నెస్ లేని ఆటలే
- నాతో పాటు 10కే రన్ కు వచ్చి, ఫిట్ నెస్ నిరూపించుకోవాలి
కేటీఆర్ వి అన్నీ ఫిట్ నెస్ లేని ఆటలేనని ఎద్దేవా చేశారు. చేతనైతే కేటీఆర్ తనతోపాటు 10కే రన్ పోటీకి రావాలని, ఫిట్ నెస్ ను నిరూపించుకోవాలని రేవంత్ సవాల్ విసిరారు. గతంలో తెలంగాణ ఉద్యమం ముసుగులో చిల్లర రాజకీయాలు చేసిన కేటీఆర్... ఇప్పుడు అధికారం ముసుగులో జులుం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.