భర్త మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు డబ్బు లేక... భిక్షాటన చేసిన భార్య!
- మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన భర్త
- శవాన్ని తీసుకెళ్లేందుకు సాయం చేయాలంటూ కన్నీటి వేడుకోలు
- ఆసుపత్రి వర్గాలపై రోగుల బంధువుల ఆగ్రహం
దీంతో చేసేదేమీ లేక అతన్ని అడ్మిట్ చేసుకుని చికిత్సను ప్రారంభించారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ, గొంతు బిగుసుకుపోయి, ఊపిరి తీసుకోలేని స్థితిలో నిన్న బాబూ సాహెబ్ మరణించాడు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి తీసుకు వెళ్లేందుకు డబ్బుల్లేని పరిస్థితిలో ఉన్న ఆమె, ఏడుస్తూ, అక్కడి ఇతర రోగులు, వారి సహాయకులను సాయం చేయాలంటూ యాచించింది. కొందరు దయ చూపి డబ్బులివ్వగా, ఓ ఆటోలో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. శవాన్ని తరలించేందుకు వాహనాన్ని ఏర్పాటు చేయని ఆసుపత్రి వర్గాలపై రోగుల బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.