వైసీపీ సహకరిస్తే.. టీడీపీపై అవిశ్వాసం: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
- లోక్ సభలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది
- రాజీనామాలు చేసి వైసీపీ పనికిరాని పక్షంగా మిగిలిపోయింది
- అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడం దారుణం
టీడీపీ, కాంగ్రెస్ ల స్నేహ బంధానికి లోక్ సభ వేదికగా నిలిచిందని అన్నారు. రాజీనామాలు చేసి పనికిరాని పక్షంగా వైసీపీ మిగిలిపోయిందని విమర్శించారు. ఎమ్మెల్యేలుగా ప్రజలు ఎన్నుకుంటే... పోరాటం సాగించకుండా, అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడం దారుణమని అన్నారు. వైసీపీ సహకరిస్తే, టీడీపీపై అవిశ్వాసం పెట్టేందుకు తాము సిద్ధమని చెప్పారు.