Chiranjeevi: నేను నటించిన హీరోల్లో మోస్ట్ రొమాంటిక్ చిరంజీవి: కాజల్

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవరైనా ఏం చెబుతారు? గొప్ప డ్యాన్సర్, గొప్ప నటుడు, గ్రేట్ యాక్షన్ హీరో, తెలుగు తెరను శాసిస్తున్న మెగాస్టార్ అని చెబుతారు. కానీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం... చిరంజీవి మోస్ట్ రొమాంటిక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను నటించిన హీరోల్లో అందరి కంటే ఎక్కువ రొమాంటిక్ చిరంజీవి అని చెప్పింది.

'ఖైదీ నంబర్ 150' సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటించిన సంగతి తెలిసిందే. కాజల్ వ్యాఖ్యలు కుర్ర హీరోలకు షాక్ ఇస్తాయని చెప్పక తప్పదు. అంతేకాదు, చిరంజీవికి కూడా ఇబ్బందిని కలిగించేవే. 60 సంవత్సరాలు దాటిన చిరంజీవి ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా ఉన్నారు. 'ఖైదీ నంబర్ 150'లో ఆయన చేసిన డ్యాన్సులు ప్రేక్షకులను మైమరపించాయి. వయసు పెరిగినా, తనలో సత్తా మాత్రం తగ్గలేదని చిరు నిరూపించారు. ఈ నేపథ్యంలో, కాజల్ ఆయనను పొగుడుతూ, ఈ కామెంట్ చేసింది. 
Chiranjeevi
Kajal Agarwal
romantic

More Telugu News