Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ గాంధీని సూటిగా ఒక్కటే అడుగుతున్నా!: టీఆర్ఎస్ ఎంపీ వినోద్

  • అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ చెబుతున్నారు
  • ఏపీకి పన్ను మినహాయింపులు కూడా ఇస్తారా?
  • స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటో బీజేపీ, కాంగ్రెస్ లు చెప్పాలి
2019లో అధికారంలోకి వస్తే... వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెబుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఏపీకి నిధుల కేటాయింపు, ఇతర అంశాలకు సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. రాహుల్ గాంధీకి తాను ఒక సూటి ప్రశ్నను వేస్తున్నానని... ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి పన్ను మినహాయింపులు ఇస్తారా? లేదా? అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయాలని కోరారు.

ఏపీకి పన్ను మినహాయింపులు ఇస్తే... తమకు కూడా ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రజలు కానీ, ఏపీ ప్రజలు కానీ నిబద్ధత లేని హామీలను నమ్మబోరని చెప్పారు. స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటో బీజేపీ, కాంగ్రెస్ లు నిర్వచనం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్పెషల్ స్టేటస్ కు సంబంధించి ఎలాంటి చట్టం లేదని చెప్పారు. పన్ను మినహాయింపులను గతంలోనే జయలలిత, వీరప్ప మొయిలీలాంటి ముఖ్యమంత్రులు వ్యతిరేకించారని గుర్తు చేశారు.
vinod
TRS
special status

More Telugu News