హిందూపురంలో హీరో బాలకృష్ణ ఇంటి ముందు చేనేత కార్మికుల ధర్నా!
- చేనేత కార్మికుల రుణాల మాఫీ ఎక్కడ?
- బాలకృష్ణను కలిసి మొరపెట్టుకున్నా ప్రయోజనం శూన్యం
- ఆరోపించిన నేత కార్మిక సంఘాలు
డబ్ల్యూసీసీ పథకం కింద ఒక్కో కార్మికుడూ రూ. 50 వేల వరకూ రుణం తీసుకున్నారని, మగ్గం పనులు లేకున్నా వడ్డీలు చెల్లించామని, 2014 ఎన్నికలకు ముందు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన టీడీపీని ఆదరిస్తే, నాలుగేళ్లయినా చేసిన అప్పులు అలాగే ఉన్నాయని వారు ఆరోపించారు. సమస్యను బాలకృష్ణ దృష్టికి తీసుకెళితే, వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఆయన, నెలలు దాటినా స్పందించలేదని చేనేత కార్మిక సంఘం నేతలు ఆరోపించారు. కాగా, వీరు ధర్మా చేసిన సమయంలో బాలయ్య అక్కడ లేరు.