ఏపీ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త.. 19 శాతం మధ్యంతర భృతి ప్రకటన!
- 54 వేల మంది ఆర్టీసీ కార్మికులకు లబ్ధి
- కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతైనా భరిస్తుంది
- దీని వల్ల ఆర్టీసీపై రూ.249 కోట్ల భారం పడుతుంది
ఆర్టీసీ కార్మికులకు 19 శాతం ఐఆర్ ప్రకటించడం ద్వారా 54 వేల మంది ఆర్టీసీ కార్మికులు లబ్ధి పొందనున్నారని, దీని వల్ల ఆర్టీసీపై రూ.249 కోట్ల భారం పడుతుందని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ చెల్లింపునకు ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారని, ఆ కమిటీ నివేదిక వచ్చే లోపే ఐఆర్ చెల్లించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు చెప్పారు.