'ఎన్టీఆర్'పై పెరుగుతోన్న అంచనాలు .. ఓవర్సీస్ రైట్స్ కోసం భారీ ఆఫర్
- నాగిరెడ్డిగా ప్రకాశ్ రాజ్
- బీఏ సుబ్బారావుగా సీనియర్ నరేశ్
- సంక్రాంతికి విడుదల
ఇలా ఈ సినిమా తారాగణం పెరిగిపోతూ ఉండటంతో అంచనాలు కూడా పెరుగుతున్నాయి. దాంతో సహజంగానే ఈ విషయం ఈ సినిమా బిజినెస్ పై ప్రభావం చూపుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 12 కోట్లను ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం కావడంతో, కీరవాణి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా చెబుతున్నారు. సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను జనవరి 9న విడుదల చేయనున్నారు.