టీమిండియా విజయలక్ష్యం 269 పరుగులు

  • నాటింగ్‌హమ్‌, ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్‌తో తొలి వన్డే
  • కుల్దీప్‌ యాదవ్‌కు 6 వికెట్లు
  • బెన్‌ స్టోక్స్‌ 50, బట్లర్‌ 53 పరుగులు
ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హమ్‌, ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరుగుతోన్న మొదటి వన్డేలో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లకి 268 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌లో జాసన్‌ రాయ్‌ 38, బయిర్‌స్టో 38, జోయీ రూట్ 3, మోర్గాన్‌ 19, బెన్‌ స్టోక్స్‌ 50, బట్లర్‌ 53, మోయీన్‌ అలీ 24, డేవిడ్‌ విల్లే 1, అదిల్‌ రషీద్‌ 22, లియాం ప్లంకెట్‌ 10, మార్క్‌వుడ్‌ 0 (నాటౌట్‌) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 6 వికెట్లు తీయగా, ఉమేశ్‌ యాదవ్‌కి 2, యుజువేంద్ర ఛాహెల్‌కి ఒక వికెట్ దక్కాయి.  
Go Back to Shorts
India
england
Cricket

More Telugu News