నటుడిగా నా అనుభవాలను పుస్తకంగా తీసుకొస్తాను: రాజేంద్రప్రసాద్
- చాలామందితో కలిసి పనిచేశాను
- విభిన్నమైన పాత్రలను పోషించాను
- ఈ తరం వారికి నా అనుభవాలు చెబుతుంటాను
షూటింగు విరామ సమయంలో నా అనుభవాలను వాళ్లందరికీ చెబుతూ వుంటాను. నా అనుభవాల్లో ఏ ఒక్కటి వాళ్లకి పనికొచ్చినా నాకు సంతోషమే. అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ నా అనుభవాలను గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు. నా అనుభవాలకు పుస్తక రూపం తీసుకొస్తే బాగుంటుందనే మీ సూచనను నేను స్వీకరిస్తున్నాను. రాయడం నాకు అలవాటు లేదు కాబట్టి .. ఎవరినైనా నియమించుకుని ఆ పనిని పూర్తి చేస్తాను" అని చెప్పుకొచ్చారు.