ఎన్టీఆర్ అలా అనడంతో వారం రోజులపాటు అన్నం తినబుద్ధి కాలేదు: రాజేంద్ర ప్రసాద్
- నటనలో శిక్షణ తీసుకున్నాను
- ఎన్టీఆర్ గారిని కలుసుకున్నాను
- మొదటిసారిగా ఆయన ఎదుట కూర్చున్నాను
అప్పుడు ఆయన "చూడు ప్రసాద్ .. సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే ఒక విషయాన్ని నువ్ ఫాలో కావాలి. అది నువ్వు ఫాలో అయితే నిలబడతావు, లేదంటే లేదు" అన్నారు. 'చెప్పండి' అన్నాను నేను. పౌరాణిక వేషాలు అనగానే వెంటనే రామారావు అంటారు .. కుటుంబ నేపథ్యం కలిగిన సాంఘిక చిత్రాలనగానే బ్రదర్ నాగేశ్వరరావు గారు వున్నారు. అట్లాగే డిష్యుం .. డిష్యుం సినిమాలు చేయాలంటే తమ్ముడు కృష్ణ వున్నాడు. రొమాంటిక్ సినిమాలు చేయాలంటే శోభన్ బాబు వున్నాడు. మరి నువు దేనికి పనికొస్తావో చెప్పు? అన్నారు. ఆ మాటకి ఒక వారం రోజుల పాటు అన్నం తినబుద్ధి కాలేదు" అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.