గుహలో చిక్కుకుపోయిన థాయ్ ఆటగాళ్లను కాపాడిన ఉదంతంపై రూ. 400 కోట్లతో హాలీవుడ్ సినిమా!
- ప్రకటించిన ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్ టెయిన్ మెంట్
- హక్కుల కోసం చూస్తున్నానన్న సీఈఓ మైఖేల్ స్కాట్
- కథలో ధైర్యం, హీరోయిజం ఉన్నాయని వెల్లడి
కావోస్ ఎంటర్ టెయిన్ మెంట్ కు చెందిన ఆడమ్ స్మిత్ తో కలసి తాను ఈ చిత్రాన్ని నిర్మించతలచానని, ఇందుకు రూ. 400 కోట్ల వరకూ (సుమారు 60 మిలియన్ డాలర్లు) వెచ్చిస్తానని ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్ టెయిన్ మెంట్ సీఈఓ మైఖేల్ స్కాట్ తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రకటించారు. ఈ వాస్తవ కథ హక్కులను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కథలో సాహసం, హీరోయిజం ఉన్నాయని, దాన్ని తాను స్పష్టంగా గమనించానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తాను 90 మంది డైవర్లతో మాట్లాడానని అన్నారు. ఇది కేవలం సినిమా కాదని, ఈ సాహస కార్యంలో పాల్గొని మరణించిన డైవర్ సహా ప్రతి ఒక్కరికీ నివాళిగా ఈ చిత్రం తీస్తానని చెప్పుకొచ్చారు.