మోదీ గారూ, మీక్కూడా అదే చెబుతున్నాను!: మురళీమోహన్
- చంద్రబాబుని ఎదగనిస్తే దేశ ప్రధాని అవుతారని మోదీ భావన
- అందుకే, బాబుని తొక్కి పెడుతూ ఏపీకి అన్యాయం చేస్తున్నారు
- చంద్రబాబుకి కోపమొస్తే మీరు భస్మమైపోతారు
మోదీ మాటలు మాత్రం కోటలు దాటాయి, చేతలు చూస్తే పాతాళంలో ఉన్నాయి. మోదీ మనకు ఎందుకు అన్యాయం చేస్తున్నారనే విషయమై ఆలోచిస్తే నాకు కనపడింది ఒకటే.. చంద్రబాబునాయుడు గారిని ఇంకా ఇంకా ఎదగనిస్తే, రేపు దేశ ప్రధానిగా ఆయనే అవుతాడని భావించి ఆయన్ని తొక్కి పెడుతున్నారు. మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. తెలుగు వాడు తలచుకుంటే సాధించలేనిది లేదు. మోదీ గారూ, మీక్కూడా అదే చెబుతున్నాం. మీకు తెలియకపోతే, ఓసారి గతచరిత్ర చూడండి. లేకపోతే, ఇందిరాగాంధీ గారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్లి తెలుసుకుని రండి. చంద్రబాబునాయుడుగారికి కోపమొస్తే మీరు భస్మమైపోతారు..మీరు నిలబడలేరు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.