రాష్ట్రానికి శాపం వెంకయ్య ఉప రాష్ట్రపతి కావడమే: జేసీ దివాకర్ రెడ్డి
- మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం ఏపీకి బెల్లం ముక్క కూడా ఇవ్వరు
- ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పా
- టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో జేసీ స్పందన
ఏపీ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షకు నిరసనగా అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో టీడీపీ ఎంపీలు నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.