ఒకటి, రెండు కాదు... పలు సింహాల మంద రోడ్డుపైకి వస్తే... గుజరాత్ లో కనిపించిన అరుదైన దృశ్యాలు చూడండి!

  • అమ్రేలీ ప్రాంతంలో ఘటన
  • బస్సులో వెళుతుంటే రోడ్డుకు అడ్డంగా సింహాలు
  • వీడియోలు తీసి పంచుకున్న ప్రయాణికులు
గుజరాత్ లోని అమ్రేలీ ప్రాంతపు అడవి గుండా బస్సులో వెళుతున్న ప్రయాణికులకు అరుదైన దృశ్యం కనిపించింది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఓ సింహాల మంద రోడ్డుపైకి వచ్చింది. బస్సుకు అడ్డంగా నిలిచాయి. కాసేపు అటూ ఇటూ తిరిగాయి. ఇంకాసేపటికి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోయాయి. సింహాలను చూసి బస్సును ఆపిన డ్రైవర్, అవి తిరిగి అడవిలోకి వెళ్లేంత వరకూ వేచి చూసి, ఆపై బస్సును ముందుకు కదిల్చాడు. బస్సులోని ప్రయాణికులంతా సంభ్రమాశ్చర్యాలకు లోనై, తమకు ఎదురుగా ఉన్న సింహాలను స్మార్ట్ ఫోన్లలో బంధించే పనిలో ఉన్నారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో తమ వారితో పంచుకున్నారు. అవిప్పుడు వైరల్ అయ్యాయి. దాన్ని మీరు కూడా చూడవచ్చు.
Go Back to Shorts
Gujarath
Amreli
Lions
Bus
Road

More Telugu News