రక్షకభటుడు కాదు.. క్షుద్ర మాంత్రికుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రక్షకభటుడు కాదు.. క్షుద్ర మాంత్రికుడు!

అతనో సీనియర్ పోలీస్ కానిస్టేబుల్. పేరు మున్నిలాల్. జార్ఖండ్ పోలీస్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి. అతను చేయాల్సిందల్లా ప్రజలకు అన్ని విధాలా రక్షణ కల్పించడమే. అది అతని వృత్తి. కానీ, మున్నీలాల్ ప్రవృత్తి గురించి తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇంట్లో నిత్యం క్షుద్ర పూజలు నిర్వహించడమేకాదు, తాంత్రిక శక్తులను ప్రసన్నం చేసుకునేందుకని నరబలులకూ తెగిస్తాడీ కిరాతకుడు.

తాజాగా, అతని ఇంట్లో ఇద్దరు బాలికలను కాళ్ళూచేతులు కట్టివేసిన స్థితిలో ఉండగా కనుగొన్నారు. వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి ఆ చిన్నారులకు విముక్తి కల్పించారు. గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలు ఒక్కసారిగా కనిపించకపోయేసరికి ఆ చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

వెతకడం ప్రారంభిస్తే మున్నిలాల్ ఇంట్లో భీతావహ స్థితిలో కనిపించారు. వారిని కాళికామాతకు బలిచ్చేందుకు మున్నీలాల్ సిద్ధంగా ఉన్నాడట. దీంతో, బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆ తాంత్రిక పోలీసును అదుపులోకి తీసుకున్నారు. దిగ్భ్రాంతికి గురిచేసే విషయం ఏంటంటే, మున్నీలాల్ ఇంట్లో పోలీసులు సోదా చేయగా.. 11 అస్థిపంజరాలు లభ్యమయ్యాయట. ప్రస్తుతం మున్నీలాల్ తో మరిన్ని నిజాలు కక్కించే పనిలో జార్ఖండ్ పోలీసులున్నారు.

More Telugu News