ఈ నెలలో రెండు ఖగోళ వింతల దర్శనం!
- 27న సంపూర్ణ చంద్రగ్రహణం
- 1.43 గంటల పాటు కొనసాగనున్న గ్రహణం
- 31న అతి దగ్గరకు రానున్న అంగారకుడు
ఆపై 2003 తరువాత ఇప్పుడు అంగారకుడు భూమికి 5.76 కోట్ల కిలోమీటర్ల దగ్గరికి రానున్నాడు. 2003లో 60 వేల సంవత్సరాల తరువాత 5.57 కోట్ల కిలోమీటర్ల దగ్గరికి వచ్చి వెళ్లిన అంగారకుడు, ఈ దఫా ఇంకాస్త దూరంలో కనిపించనున్నాడు. దీన్ని 31వ తేదీ సూర్యాస్తమయం తరువాత ఎప్పుడైనా వీక్షించవచ్చు. టెలిస్కోప్ అవసరం లేకుండానే అంగారకుడుని చూడవచ్చని, ఓ సాధారణ టెలిస్కోపుతో చూస్తే ఆ గ్రహంపై ఉండే మంచు ఫలకాలు కూడా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. తూర్పు ఆగ్నేయ దిశలో అంగారకుడు కనిపిస్తాడని, మళ్లీ 2035లోనే అంగారకుడిని స్పష్టంగా చూసే అవకాశం లభిస్తుందని తెలిపారు.