ఆఫీసుకు వెళ్లిన యువతి నుంచి చనిపోతున్నట్టు మెసేజ్.. హైదరాబాద్‌లో ఘటన
- ఐ విల్ ఎండ్ మై లైఫ్ అంటూ సోదరుడికి మెసేజ్
- కార్యాలయానికి వెళ్తే తాళం
- వెతికినా ఫలితం శూన్యం.. పోలీసులకు ఫిర్యాదు
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆఫీసుకని వెళ్లిన నర్మద సాయంత్రం ఏడు గంటల సమయంలో ఎస్సార్ నగర్‌లోని హాస్టల్లో ఉంటున్న సోదరుడు కృష్ణప్రసాద్‌కు ఫోన్ చేసి ఆఫీసు నుంచి రావడం ఆలస్యం అవుతుందని చెప్పింది. ఆ తర్వాత కాసేపటికే తాను చనిపోతున్నట్టు చెబుతూ ‘ఐ విల్ ఎండ్ మై లైఫ్’ అని మెసేజ్ పెట్టి స్విచ్చాఫ్ చేసింది.
వెంటనే అప్రమత్తమైన కృష్ణప్రసాద్ లక్డీకాపూల్‌లో ఆమె పనిచేస్తున్న ఆఫీస్‌కు వెళ్లాడు. తాళం వేసి ఉండడంతో ఆమె స్నేహితులు, తెలిసిన మిత్రుల వద్ద వాకబు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో శనివారం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నర్మద కోసం గాలిస్తున్నారు.